UPDATES  

 అధికారులు,ప్రజాప్రతినిధులు బాధ్యతగా పనిచేయాలి వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలి

  • అధికారులు,ప్రజాప్రతినిధులు బాధ్యతగా పనిచేయాలి
  • వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలి
  • గ్రామాలలో పారిశుధ్యం పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించండి
  • జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీ,రైతుబంధు కల్పిస్తాం
  • దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
  • పదేళ్లలో సాధించిన ప్రగతిపై ప్రజలను బాగా భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు.
  • మండల సర్వసభ్య సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 26

మణుగూరు మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో శుక్రవారం ఏర్పాటు చేసిన సర్వ సభ్య సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా శాఖల వారిగా పనితీరును, మండలంలో జరుగుతున్న కార్యక్రమాలను అధికారలు, ప్రజా ప్రతినిధులతో సమీక్షించారు.శాఖల వారిగా అధికారులకు పలు సూచనలు చేశారు.మిషన్ భగీరథ అధికారుల పనితీరును వారు ప్రశంసించారు.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ, అధికారులు ప్రజాప్రతినిధులు బాధ్యతగా పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న వర్షాకాలం సీజన్ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి, గ్రామాలను ఖాళీ స్థలాలను పరిశుభ్రం చేయాలన్నారు. జూన్ 2 నుండి నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులు ప్రజాప్రతినిధులకు తెలిపారు. పదేళ్ల లో చేసిన అభివృద్ధి, సంక్షేమం,సాధించిన ప్రగతిపై ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.అందరి కృషితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతిలో మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. మే 24 నుండి పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తామన్నారు రైతు బంధు కూడా రైతుబంధు కూడా కల్పిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం నరసింహారావు,వైస్ ఎంపీపీ కేవీ రావు,తహసిల్దార్ నాగరాజు,ఎండిఓ చంద్రమౌళి, ఎంపీఓ వెంకటేశ్వర్లు, పిఎసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు ఎంపిటిసిల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,ఎంపీటీసీలు బాబురావు,సమ్మక్క,సర్పంచులు ఏనిక.ప్రసాద్,కారం. ముత్తయ్య,రామకృష్ణ,బోగ్గం.రజిత,కొమరం.జంపేశ్వరి,ఈశ్వరమ్మ,పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !