మన్యం న్యూస్, పినపాక:
గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని శుక్రవారం మండల పరిధిలోని సీతంపేట పంచాయితీలో బెస్తగూడెం గ్రామంలో అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు ప్లాస్టిక్ వాడటం వల్ల వచ్చే నష్టాలను వివరించారు. అలాగే పెరటి మొక్కల పెంపకం గురించి లాభాలు గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ కూరగాయలు పెరటి తోటలో పండించి తినడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సత్యవతి,
అంగన్వాడీలు వార చంద్రకళ , సౌందర్య, శ్రీను , శారద , గ్రామస్తులు పాల్గొన్నారు.