వెంకటాపురం మే 26
మన్యం న్యూస్ నుగూర్ వెంకటాపురం.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం శుక్రవారం నాడు శివాలయం దగ్గరలోని కంకల వాగు బ్రిడ్జి దగ్గర శుక్రవారం చర్ల వైపు నుంచి వెంకటాపురం వస్తున్న ఇసుక లారీ బోల్తా పడింది.వివరాల్లోకి వెళితే టీఎస్ O7-4829 నంబర్ గల లారీ చర్ల మండలం కత్తి గూడెం క్వారీలో ఇసుక లోడు చేసుకొని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.లారీ డ్రైవర్ మోర.భాస్కర్ వయసు 45 సంవత్సరాలు హైదరాబాద్ ఎల్బీనగర్ కు సంబంధించిన వ్యక్తి ప్రమాదంలో ఇతనికి చిన్న గాయం కూడా తగలకుండా ప్రాణాలతో బయటపడ్డాడు.
సమాచారం అందుకున్న స్థానిక పోలీస్ శాఖ వారు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించినట్లు సమాచారం.