మన్యం న్యూస్ చండ్రుగొండ మే 26 : భారత పార్లమెంటును రాష్ట్రపతిచే ప్రారంభించాలని సిపిఎం మండల కార్యదర్శి ఐలూరి రామిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త వి. సావాస్కర్ జన్మదినం నాడు భారత పార్లమెంటును ప్రారంభించడం శోచనీయమన్నారు. దేశంలోని 18 పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించటం జరిగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత ఇల్లుగా పార్లమెంటును భావిస్తున్నాడని విమర్శించారు. 2024 ఎన్నికలలో బిజెపిని ప్రజలు ఓడించటం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో గుర్రంగూడెం సర్పంచ్ కాకా సీత, సిపిఎం మండల నాయకులు రామడుగు వెంకటాచారి, రాయి రాజా, కాకా వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.