UPDATES  

 విద్యుత్ సమస్యలు పై ఏఈ కి వినతి పత్రం సమర్పించిన కాగ్రెస్ నాయకులు

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 26: అశ్వారావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొగలపు చెన్నకేశవరావు ఆధ్వర్యంలో మండలంలోని కరెంట్ సమస్యలపై స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ ఏఈకి లిఖిత పూర్వక పత్రం శుక్రవారం అందజేసారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఒకప్పుడు కరెంటు పోతే వార్త, ఇప్పుడు కరెంటు ఉంటే వార్త రాష్ట్రంలో రైతులకు 24 గంటల పంట పొలాలకు విద్యుత్తు సరఫరా మాట ఇచ్చి గద్దెనెక్కిన బిఆర్ఎస్ ప్రభుత్వం మండలం లో కరెంటు కష్టాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయన్నారు. చిన్నపిల్లల వృద్ధులు రైతులు కరెంటు లేక వేసిన పంటలు ఎండిపోవడం జరుగుతుందని, మరోవైపు అదనపు వినియోగం పేరుతో వినియోగించిన కరెంటు చార్జీలకు బదులు మూడింతలు బిల్లులు పంపిస్తుండడంతో వినియోగదారులు షాకు గురవుతున్నారని తెలిపారు. గతంలో అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్ (ఏఎస్ఓ) పేరుతో అదనంనంగా డిపాజిట్ను కట్టించుకున్న ఎన్పీడీసీఎల్ ఇప్పుడు అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ (ఏసీడీ) పేరుతో మళ్లీ బిల్లులు పంపిస్తోందన్నారు. వివిద ప్రాంతాల్లో రిపేర్లు చేస్తున్నట్లు ప్రకటించి, నిత్యం 8 గంటల పాటు కరెంట్ కోత విధిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించిందని, ఈ కార్యక్రమాల్లో భాగంగా మొక్కలను నాటి విద్యుత్ వైర్లకు మొక్కలు అడ్డొస్తుందని నాడు నరకడం పనిగా ప్రభుత్వం పనిచేస్తుందని, నిత్యం ఎదో ఒక కారణంతో గంటల తరబడి కరెంట్ సరఫరాలో కోత విధించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ చెన్నకేశవ రావు, కో ఆప్షన్ సభ్యులు ఎస్ కే పాషా, ఎంపీటీసీ వేముల భారతి, ప్రచార కార్యదర్శి జల్లిపల్లి దేవరాజు, ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ తగరం రాజేష్, రమాదేవి, వెంకన్న బాబు, సానబోయిన అంజి, మేక అమర్నాథ్ మొదలైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !