UPDATES  

 కంటివెలుగుతో అంధత్వ నివారణ…

 

మన్యం న్యూస్ చండ్రుగొండ మే 26 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంతో అంధత్వ నివారణ జరుగుతుందని పంచాయతీ సర్పంచ్ ఇర్పా లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం దామరచర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన కంటి వెలుగు కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కంటివెలుగుతో కంటికి సంబంధిత సమస్యలు దూరమవుతాయన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి 18 సంవత్సరాల పైబడిన వారు ప్రతి యొక్కరు సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శంకర్, వైద్యసిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !