UPDATES  

 ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ చొరవతో తీరిన ఇల్లందు

ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ చొరవతో తీరిన ఇల్లందు నియోజకవర్గ ప్రజల కోరిక* ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభం
డయాలసిస్ కేంద్రం పేద ప్రజలకు వరం*
ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్*

*మన్యం న్యూస్,ఇల్లందు..ఇల్లందు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన డయాలసిస్ కేంద్రం ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ చేతులమీదుగా శనివారం ప్రారంభించబడింది. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…పేదప్రజల చెంతకే కార్పొరేట్ వైద్యం ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించటం రాష్ట్ర వైద్య చరిత్రలోనే గొప్ప విషయం అన్నారు. ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ లేకపోవడం వల్ల నియోజకవర్గ గ్రామాల డయాలసిస్ రోగులు వైద్యం కొరకు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసి వెళ్లడంలో చాలా ఇబ్బందులు పడ్డారని, నేడు వారికి ఉపయోగపడేలా ఇల్లందు ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో డయాలసిస్ కొరకు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ వెళ్లేవారని నేటితో వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఐదు బెడ్లతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏదైనా జబ్బు చేసి ఆస్పత్రికి వెళ్తే చికిత్స కంటే వైద్య పరీక్షలకే ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయని, మూత్రపరీక్ష నుంచి రక్తపరీక్ష వరకు ఏవేవో అనేక టెస్ట్‌లు రాసి వాటికి నిరుపేదల నుంచి వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తారని, సామాన్య ప్రజలపై ఈ భారం పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయటం హర్షణీయం అని, మరోమారు కేసీఆర్ రాజకీయ దక్షతను ప్రజలకు తెలియజేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో కేవలం 7 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు జిల్లాకు ఓ మెడికల్ కాలేజ్ లు ఏర్పాటు కానున్నాయన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు చర్యలలో భాగంగా
ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీలు అందజేస్తూ
లక్షలాది రూపాయల చికిత్సలకూ ఉచితంగా వైద్యం అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసిఆర్ లకు దక్కిందన్నారు. డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్, వైద్యశాఖ మంత్రి హరీష్ రావు, కేటీఆర్, ఉమ్మడి జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పినపాక ఎమ్మెల్యే, విప్ రేగా కాంతారావు లకు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ శిరీష్ కుమార్, డియంఓ డాక్టర్ హర్షవర్ధన్, డిప్యూటీ డియంఓ డాక్టర్ భాన్సిలాల్, ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ మురళీధర్ రెడ్డి, డాక్టర్లు వెంకన్న, తేజశ్రీ, సాయిచరిష్మా, మాధురి, సింధు, విజయ, విజయశ్రీ, రమ్య, హర్షియ, సుధారాణి, లాస్య, డయాలసిస్ ఇంఛార్జి లెనిన్, సూపర్వైజర్ జగదీష్ , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీపాషా, మున్సిపల్ కమిషనర్ అంకుషావలి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పులిగళ్ల మాధవరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు కటకం పద్మావతి, సయ్యద్ ఆజాం, లలిత శారద, జేకే శ్రీను, కడగంచి పద్మ, రజిత రవి, పాబొలు స్వాతి కిరణ్, ఇల్లందు పట్టణ మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, పట్టణ ఇంచార్జ్ సుధీర్ తొత్ల, వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి, ఉపాధ్యక్షుడు పివి కృష్ణారావు, అధికార ప్రతినిధి కుంట నవాబు, ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, ఇల్లందు పట్టణ నాయకులు గిన్నారపు రవి, ఎర్ర ఈశ్వర్, కరాట రమేష్, సంద ప్రవీణ్, యువజన నాయకులు నెమలి నిఖిల్, పాలడుగు రాజశేఖర్, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !