మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి మే 27: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ఉదయం ఐదున్నర గంటలకు శ్రీ స్వామివారికి అభిషేక మహోత్సవం,అనంతరం స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా జరిగింది.ఈ స్వామివారి కళ్యాణాన్ని ఎర్రగుంట వాస్తవ్యులు బోయినపల్లి పెద్ద సుబ్బారావు,శిరీష దంపతులు,నూజివీడు వాస్తవ్యులు ఇందుకూరు గోపి రాజు,లతా దంపతులు,తుమ్ము గూడెం వాస్తవ్యులు శుగ్గల రామారావు,అన్నపురెడ్డిపల్లి వాస్తవ్యులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు,రాణి దంపతుల అధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిగింది.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాలు ఆలయ మేనేజర్ శ్రీ పివి రమణ పర్యవేక్షణలో జరిగినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు.





