మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
వెంకటాపురం మండలంలోని మర్రివానిగూడెం ఒంటిచింతల గూడెం ఇసుక పేసా గ్రామ సభలు శనివారం ఏకగ్రీవం అయ్యాయి.
మొర్రివానిగూడెంలో మొత్తం 110 మంది ఎస్టీ ఓటర్లు ఉండగా అందులో 81 మంది హాజరైనారు గోదావరి గిరిజన సొసైటీకి ఇసుక తవ్వకాల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ 75 మంది ఆమోదించారు. అందులో ఆరుగురు వ్యతిరేకించారు. ఒంటి చింతలగూడెంలో ఎస్టీ ఓటర్లు మొత్తం69 మంది ఉండగా అందులో 58 మంది హాజరై ఏకగ్రీవంగా ముత్యాలమ్మ గిరిజన సొసైటీ నీ తీర్మానించారు.
ఈరోజు షెడ్యూల్లో పూజారి గూడెం గ్రామసభ జరగాల్సి ఉన్నప్పటికీ పిఓ ఐటిడిఏ ఏటూరునాగారం ఆదేశాల మేరకు సభను వాయిదా వేశారు. తదుపరి తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు ఎంపీడీవో బాబు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పేసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్, మడకం సారయ్య, మురువానిగూడెం సర్పంచ్, ఏదిరా సర్పంచ్, కారం కన్నయ్య, పంచాయతీ కార్యదర్శులు శృతి, రాజకుమారి,, రాజు తదితరులుపాల్గొన్నారు





