మన్యం న్యూస్ కు స్పందించిన అధికారులు
నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేసిన విద్యుత్ శాఖ అధికారులు
-సర్పంచ్ ఏనిక.ప్రసాద్.
మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 28
, కూనవరం గ్రామ పంచాయతీ లో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై మన్యం రాసిన వార్తకు అధికారులు స్పందించారు.ఈ మేరకు పంచాయతీ పరిధిలోని పైగుంపు,సియూ పి ఎస్ స్కూల్ వీది,మడకం ముత్తయ్య వీది,హెవీ వాటర్ ప్లాంట్ రోప్ వే దగ్గర మడకం అర్జయ్య వీది లో ఆదివారం విద్యుత్ శాఖ అధికారులు నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్తంభాల పనులను స్థానిక సర్పంచ్ ఏనిక ప్రసాద్ దగ్గర ఉండి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.





