UPDATES  

 పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఎలా వచ్చింది.

పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఎలా వచ్చింది.
నీ ఊసరవెల్లి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
అధికార పార్టీ జెడ్పీ చైర్మన్ గా ఉండి పోడు పట్టాలకు సాధనకై ధర్నా చేయడం సిగ్గుచేటు
మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు*
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అన్వర్ పాషా
మన్యం న్యూస్ కరకగూడెం: అధికార పార్టీలో ఒక ఎంపీగా ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఎలా వచ్చిందని వచ్చేనెల 27వ తారీకు నుండి పెద్ద ఎత్తున పోడు భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తా ఉంటుంటే దానిపై పోడు సాగుదారుల పంపిణీ కార్యక్రమం సాధన పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి ధర్నాలు చేస్తామంటే పోడు సాగుదారులు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధికారి ప్రతినిధి అన్వర్ పాషా అన్నారు. ఆయన ఆదివారం మండల బిఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జిల్లా పరిషత్ చైర్మన్ కొమరం కనకయ్యలకు అప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఎలా వచ్చిందని ఆయన అన్నారు ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల పట్టాలు పంపినకై పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంటే పొడుగు సాగుదారులకు పట్టాలు పంపిణీ చేయాలని ధర్నాలు రాస్తారోకులు చేయడం మీ ఊసరవెల్లి మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. అలాగే మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు రాని ఆలోచన ఇప్పుడు ఎలా వచ్చిందని ఆయన ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతూ పోడు భూముల సాధనకై ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలు జిల్లా పరిషత్ చైర్మన్ కొమరం కనకయ్య పాల్గొనడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. కొత్త బిచ్చగానికి అన్నట్టు గొడ్డుకో దెబ్బ రోజుకో మాట మాట మాట్లాడుతూ నిన్ను నమ్ముకున్న ప్రజలను అయోమయంలో పడేస్తున్న ఆ ప్రజలు కూడా త్వరలో మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. డబ్బు మదంతో ప్రజలను మోసం చేయాలని చూస్తే అది ముమ్మాటికీ నిన్ను నమ్ముకున్న ప్రజలను మీరు నట్టేట ముంచినట్లేనని అన్నారు. ఇకనైనా మీ పిచ్చి మాలిన మాటలు మానుకొవలని అన్నారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం సర్పంచ్ ఊకె. రామనాథం,బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య గౌడ్,నాయకులు రేగా.సత్యనారాయణ,గుమ్మడివెల్లి.ప్రసాద్‌, కటుకోజ్వల.వేణు,మల్కం.వెంకటేశ్వర్లు, గొగ్గలి. నర్సయ్య,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !