మన్యం న్యూస్ చండ్రుగొండ మే 28 :
1992 ,1995 బ్యాచ్ కి చెందిన చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు స్థానిక భాస్కర ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ కలయిక ఆదివారం జరిగింది. వారి బాల్య జీవితాన్ని పాఠశాలల్లో గడిపిన ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు . బాల్య మిత్రులందరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కలయిక వారి మనసులో ఎంతో ఆనందం నిలిపింది.





