మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 28
మణుగూరు మండలం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెంటర్ లో ఆదివారం మణుగూరు కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ముందుగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకు ను,అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,విశ్వ విఖ్యాత నటుడిగా, పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అన్నారు.తెలుగు వారి ఆత్మ గౌరవం నిలబెట్టిన మహానుభావుడు పేదల పెన్నిధి అని కొనియాడారు.రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారు అని, ఎందరో యువతకు ఆదర్శంగా ఎన్టీఆర్ నిలిచారన్నారు.వారి సేవలు చీర స్మరనియం అని ఎన్టీఆర్ కు నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ అన్నారు.వారి ఆశయాలను సీఎం కెసిఆర్ పాటిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారు.వారి ఆశయాలను కొనసాగించడమే ఆయనకీ మనమిచ్చే ఘనమైన నివాళి అని ఈ సందర్భంగా విప్ రేగా తెలియజేశారు.ఈ కార్యక్రమం లో జెడ్పీటీసీ పోశం. నర్సింహారావు, మణుగూరు డిఎస్పీ రాఘవేందర్ రావు,సీఐ ముత్యం రమేష్,స్ధానిక ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,కార్యదర్శి నవీన్,నాయకులు వట్టం. రాంబాబు,యూసఫ్,రమేష్, యువజన నాయకులు సాగర్ యాదవ్,హర్ష నాయుడు,పలు పార్టీల నాయకులు, మణుగూరు కమ్మ మహాజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





