వీఆర్ఏల క్రమబద్ధీకరన పై హర్షాతిరేకాలు
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు ఘన సన్మానం చేసిన వీఆర్ఏలు
మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 28
మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను వీఆర్ఏలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్రం ప్రభుత్వం వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించడంతో పినపాక నియోజకవర్గ పరిధి లోని అన్ని మండలాల వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చేశారు. అనంతరం వీఆర్ఏలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను శాలువాలతో ఘనంగా సత్కరించి,కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోశం.నర్సింహారావు, పిఏసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, కార్యదర్శి నవీన్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు,వీఆర్ఏలు పాల్గోన్నారు.





