ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి తుమ్మల ఎమ్మెల్యే మెచ్చా
మన్యం న్యూస్, దమ్మపేట, మే, 28: మండల పరిదిలోని మొద్దులగూడెం, నాయుడుపేట రింగు వద్ద ఆదివారం స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సహకారంతో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే మెచ్చా ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఒకే వేదికపై మూడు పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు బిఆర్ఎస్ ఎమ్మెల్యే మెచ్చా, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న తాటి అదే విదంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కట్రం స్వామి పాల్గొనడం విశేషం. ఈ సందర్బంగా మాజీ మంత్రి తుమ్మల శతజయంతి వేడుకను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి నేను, తాటి, మెచ్చా వరుకు ఎన్టీఆర్ పెట్టిన బిక్ష అని అన్నారు. తెలుగుదేశం పాలనలోనే ఈ రోజున ఇన్ని తారు రోడ్లు వచ్చాయన్నారు. తరతారాలు చెప్పుకోవాల్సిన వ్యక్తి తారక రామారావు అని అన్నారు. అనంతరం వచ్చిన వారికి తుమ్మల మరియు ఎమ్మెల్యే మెచ్చా స్వయంగా అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీపీ లు, వైస్ ఎంపీపీ లు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.





