సోమవారం జరగబోయే పట్టణ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్
మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు పట్టణంలో సోమవారం నాడు నిర్వహించబోయే ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని నాయకులకు, కార్యకర్తలకు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ దిశానిర్దేశం చేశారు. ఇల్లందు పట్టణంలోని సింగరేణి స్కూల్ గ్రౌండ్ నందు సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించబోయే ఇల్లందు మున్సిపాలిటీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఎమ్మెల్యే పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ టౌన్ కమిటీ, అనుబంధ సంఘాలు, యూత్ విభాగం సభ్యులు సకాలంలో హాజరై ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు.





