మన్యం న్యూస్, దుమ్ముగూడెం మే 28::
మండల కేంద్రంలోని లక్ష్మీనగరంలో శక పురుషుని శతజయంతి వేడుకలు మండల అధ్యక్షులు కొమరం దామోదరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం ములకపాడు ఆస్పటల్ నందు రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తేజు మూర్తి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరుపుకోవడం అదృష్టమని సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో తనదైన ముద్రవేశారని పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కల్లూరు ప్రసాద్ లక్ష్మయ్య వీరస్వామి శ్రీరాములు భాస్కర చారి వీరయ్య తదితరులు పాల్గొన్నారు





