మన్యం న్యూస్: జూలూరుపాడు, మే 28, మండల పరిధిలోని వెంగ న్నపాలెం గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జూలూరుపాడు నుండి గుండెపుడి వైపుకు వెళుతున్న రెండు ద్విచక్ర వాహనాలు వెంగన్నపాలెం ముత్యాలమ్మ గుడి సమీపం వద్ద ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో మండల పరిధిలోని బచ్చల కోయగూడెం గ్రామానికి చెందిన జబ్బా మధు, ముక్తి నాగరాజు, గుండెపుడి కి చెందిన తాటి అప్పారావు, నల్లబండ బోడు కు చెందిన బచ్చల శ్రీను అనే యువకులు రెండు ద్విచక్ర వాహనాలపై ప్రక్కగా వెళుతుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ముగ్గురు కి గాయాలయ్యాయి. ప్రమాద సంఘటనను చూసిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించగా క్షతగాత్రులను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





