UPDATES  

 పొంగులేటి నీ డ్రామాలు చెల్లవు పోడు యాత్ర పేరుతో రైతులకే మోసం

  • పొంగులేటి నీ డ్రామాలు చెల్లవు
  • పోడు యాత్ర పేరుతో రైతులకే మోసం
  • 50 వేల మందికి పోడు పట్టాలు సిద్ధం చేసిన ప్రభుత్వం
  • జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం
  • భద్రాద్రి జిల్లాలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో
  • అభివృద్ధితో సమూల మార్పులు
  • ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి పోడు సమస్యపై
  • పెదవి విప్పని పొంగులేటి
  • కుర్చీ కోసం పొంగులేటి కుటిల రాజకీయాలు
  • పొంగులేటి పై ధ్వజమెత్తిన రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 28

రైతుల పోడు పట్టాల కోసం పోరాడుతున్నామని మీరేనా చెప్పేది. మీరు చేస్తున్న పోడు యాత్ర చూస్తుంటే నవ్వొస్తుంది.. మూడు రైతుల కోసం ఏనాడు పెదవి విప్పని పొంగులేటి నేడు ప్రగల్బాలు పలుకుతున్నాడు.. అధికార పార్టీలో ఉండిన మేము మూడు రైతుల కోసం మొట్టమొదటిగా ప్రశ్నించి ముఖ్యమంత్రి కేసీఆర్ను మెప్పించి పోడు పట్టాలను రప్పించిన ఘనత ఆదివాసి బిడ్డగా తనకే దక్కిందని.. పినపాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ రేగ కాంతారావు స్పష్టం చేశారు. మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,పోడు భూములకు సంబంధించి పోడు పట్టాలు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయని వారు తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 50 వేల మందికి పోడు రైతులకు పట్టాలు పంపిణీకి సర్వం సిద్ధం చేయడం జరిగిందన్నారు. జూన్ 24 నుంచి 30 తారీఖు వరకు పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన తరువాత పోడుయాత్ర చేయడం హాస్యాస్పదం అన్నారు.ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోడు రైతుల సమస్యను ఏనాడూ పట్టించుకోలేదన్నారు.నేడు పోడు యాత్ర పేరుతో రైతులను మోసం చేస్తున్నారు అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పరిపాలనలో అభివృద్ధితో జిల్లా రూపురేఖలు మారాయి అన్నారు.రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలో భద్రాద్రి ధర్మల్ ప్లాంట్, సీతారామ ప్రాజెక్ట్,సీతమ్మ బ్యారేజ్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. సిఎం కెసిఆర్ ముందు చూపుతో దేశంలో తెలంగాణ అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిచింది అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగ్యస్వామ్యం కావాలని ఆశిస్తున్నట్లు అయిన తెలిపారు.కొత్తగూడెంలో చేసింది పోడు యాత్ర కాదని పొంగులేటి గోడు యాత్ర అన్నారు.బిఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నేటి వరకు ఏ పార్టీలోకి వెళ్లాలి అని నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో పొంగులేటి ఉన్నారని,ఏం చేయాలో పాలు పోక పోడు యాత్ర పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.మొన్నటి వరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలను పొగిడిన పొంగులేటి,నేడు తన స్వార్ధ రాజకీయాల కోసం ప్రభుత్వంపై కేసీఆర్ పై విమర్శలు చేయడం తగదు అన్నారు.సీఎం కెసిఆర్ ను విమర్శించే స్థాయి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి లేదని అన్నారు.రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక నీతి మాలిన మాటలు మాట్లాడుతున్నారు అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేద ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.జిల్లా ప్రజలు మాయమాటలు నమ్మవద్దని,జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనించాలన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు జెడ్పిటిసి పోశం.నరసింహారావు పిఎసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,కార్యదర్శి నవీన్, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు వి ప్రభాకర్ రావు,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !