మన్యం న్యూస్,ఇల్లందు:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా పట్టణ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇల్లందు పట్టణంలో గల జెడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయం నుంచి బుగ్గవాగు బ్రిడ్జి వద్దగల నందమూరి తారక రామారావు విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోరం ప్రసంగిస్తూ… స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతిని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ నలుమూలలా ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఇదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు, సినీరంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా చెరగని ముద్ర వేశారని అన్నారు. తెదేపా పార్టీ స్థాపించిన కేవలం యెనిమిది నెలల్లోనే అధికారం చేపట్టిన ఘనత ఆయనకే దక్కిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరం వెంట సర్పంచులు పాయం స్వాతి, పాయం లలిత, తాటి చుక్కమ్మ, కల్తీ పద్మ, పూనెం కవిత, ఎంపీటీసీలు మండల రాము, పూనెం సురేందర్, పాయం కృష్ణప్రసాద్, తాటి యశోద, బియ్యని రజిని, ఉపసర్పంచ్ తాటి రాంబాబు, వల్లపు ఎల్లయ్య, నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ళ సూర్యం, చిల్లా శ్రీనివాసరావు, ఊరుగొండ ధనుంజయ్, తాటి బిక్షం, ముక్తి కృష్ణ, అజ్జు, పట్టణ ఇరవైనాలుగు వార్డులకు చెందిన యువత తదితరులు పాల్గొన్నారు.





