మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 28: అశ్వారావుపేటలో తెలుగు వారి ఆరాధ్యదైవం, నట విశ్వ స్వరూపం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలు అశ్వారావుపేట రింగ్ సెంటర్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుంకావల్లి వీరభద్రరావు, బిఆర్ఎస్ మండలాధ్యక్షులు బండి పుల్లారావు, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ కట్రం స్వామి అశ్వారావుపేట కమ్మసంఘం అధ్యక్షులు సంకురాత్రి సతీష్ తదితరులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ గురించి ఎన్నో గొప్పవిషయలు స్మరించుకున్నారు. అశ్వారావుపేట కమ్మ సంఘం ఆధ్వర్యంలో 300 మందికి పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తలసీల ప్రసాద్, ఆంధ్రు ప్రసాద్, తలసీల బాలక్రిష్ణ, కాకర్ల వెంకటేశ్వరరావు నెక్కంటి ప్రసాద్, అల్లూరి బుజ్జి, తాడేపల్లి రవి , అరెపల్లి సాంబశివరావు, నార్లపాటి రాములు, సర్పంచ్ సుమతి, రామకృష్ణ, నర్రా రాకేష్, తదితరులు పాల్గొన్నారు.





