మల్లాయిగూడెం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే మెచ్చా
గాలివానకు ఇల్లు కోల్పోయిన బాధితులను పరామర్శించిన మెచ్చా
మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 29: అశ్వరావుపేట మండలంలో ఆదివారం వచ్చిన ఈదురు గాలులు ప్రభావం వల్ల పలుచోట్ల చెట్లు పడిపోవడం, ఇల్లులు కూలిపోయాయి. మండల పరిధిలోని మల్లాయి గూడెం గ్రామంలో ఇళ్లపై చెట్లు విరిగిపడడం, రేకు ఇల్లులా రేకులు ఎగిరిపోవడం, చెట్లు విరిగిపడి కరెంటు స్తంభాలు నేలకి వరగడం, పొగాకు బేరన్ లు సైతం కూలిపోవడం వల్ల స్థానిక ప్రజలకు పలువురికి గాయాలు అయ్యాయని విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెచ్చా సోమవారం ఆ గ్రామాన్ని పర్యటించారు. బాధితుల్ని పరామర్శించి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయం చేస్తానని ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. అక్కడ ఉన్న గ్రామస్థులు ఇల్లు కావాలని కోరడంతో ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలలో గృహలక్ష్మి పథకం ద్వారా 3లక్షలు ఇస్తుందని అర్హులందరికీ వచ్చేలా చేస్తానని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎంతో అభివృద్ది జరిగిందనీ, అశ్వారావుపేట నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ది చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉన్నారని, పోడు భూమి పట్టాలు కూడా వచ్చేశాయని త్వరలో పంపిణీ చేయడం జరుగుతుందని, పోడు పట్టా మాత్రమే కాకుండ పోడు భూమి ఉన్న వారికి రైతు బందు కూడా వచ్చే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని గ్రామస్థులకు తెలిపారు. మల్లాయిగూడెం, అనంతారం వెళ్ళే మార్గం బిటి రోడ్డు కావాలనీ కోరడం తో వెంటనే ఐటిడిఏ ఏఈ ప్రసాద్ కి ఫోన్ చేసి అంచన వేసి ఇవ్వాలని ఆదేశించారు. తద్వారా మంత్రితో, పిఓతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. అలాగే మంచి నీరు త్వరగా అందించాలని కరెంట్ కూడా త్వరగా అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కష్టంలో ఉన్న ఎవరు రాలేదని అలాంటిది ఎమ్మెల్యే మెచ్చా గ్రామానికి రావడం సమస్యలు తెలుసుకోని నమ్మకం కల్గించడంతో గ్రామస్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి, సర్పంచ్ నారం రాజశేఖర్, ఎంపీటీసీ వాసం బుచ్చి రాజు, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, మండల నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.





