UPDATES  

 కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

  • కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
  • బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ బాబు
  • కండువా కప్పి ఆహ్వానించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 29

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ బాబు,వారి ఆర్మీ యూత్ 500 మందితో సహా సోమవారం బిఆర్ఎస్ పార్టీ లో చేరారు.తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నవీన్ బాబు కు,వారి ఆర్మీ సభ్యులకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నవీన్ బాబు కు వారి ఆర్మీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ది, పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నవీన్ బాబు వారి ఆర్మీ సభ్యులు తెలిపారు. తొలిత హనుమాన్ టెంపుల్ నుండి కూనవరం లోని తన నివాసం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం నవీన్ బాబు నివాసంలో ఏర్పాటు చేసిన తేనెటీ విందు కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల.నాగ భూషణం,జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల.రాజేందర్, మణుగూరు జడ్పిటిసి పోశం. నర్సింహరావు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, ఎంపిటిసిల సంఘం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు,స్థానిక సర్పంచ్ ఏనిక.ప్రసాద్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,పార్టీ కార్యదర్శులు రామిరెడ్డి,నవీన్,పార్టీ సీనియర్ నాయకులు,ముఖ్య నాయకులు,కార్యకర్త లు,యువజన నాయకులు, బిఅరెస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !