చిన్నారులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రవి మన్యంన్యూస్,ఇల్లందు:టేకులపల్లి మండల బేతంపూడి గ్రామపంచాయతీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండారి నరసింహారావు కుమార్తెల ఓనీల అలంకరణ మరియు వారి కుమారుని పంచె కట్టు వేడుక సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి రవి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసిక తిరుమల్, మాజీ కౌన్సిలర్ ధారావత్ కృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సి సెల్ వైస్ చైర్మన్ బిఎన్ గోపాల్, ఇల్లందు పట్టణ కాంగ్రెస్ కమిటీ బీసీ సెల్ అధ్యక్షులు ఆనంద్, రవి, సురేష్, నరేష్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.