మన్యం న్యూస్,ఇల్లందు:ఇంటర్మీడియేట్ విద్యా సంవత్సరానికి గాను ఇల్లందు పట్టణంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు స్థానిక రాందేవ్ బాబా మందిరం నందు మాతృశ్రీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ…చదువుతోనే ఉన్నత భవిష్యత్తు సాధ్యమని, విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లితండ్రులకు, ఇల్లందు పేరు ప్రఖ్యాతలు తేవాలని కోరారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీహెచ్డబ్ల్యు గ్రూప్ నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు వైష్ణవి లోద్, సానియా కౌసర్లను ఎమ్మెల్యే, మాతృశ్రీ సేవాసంస్థ ప్రతినిధులు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ డీవీ, స్థానిక కౌన్సిలర్లు, సేవాసంస్థ ప్రతినిధులు, విద్యార్థుల తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.





