మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 29
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని సమితి సింగారం గ్రామానికి చెందిన బిఅర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రామిడి రామిరెడ్డి కుమారుడు రవిచంద్ర రెడ్డి,శ్రీ వైష్ణవి లు ఇటీవల నూతనంగా వివాహం చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వారి నివాసానికి వెళ్లి,నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి రామిడ్డి రామిరెడ్డి, వారి కుటుంబ సభ్యులు,స్థానిక ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





