UPDATES  

 గిరిజనుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

 

మన్యం న్యూస్ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్ లో గిరిజనల నుండి వచ్చిన వినతులను ఏటునాగారం ఐటీడీఏ ఏపీవో.వసంతరావు స్వీకరించినారు.ఈ గిరిజన దర్బార్ లో వివిధ మండలాల నుండి వచ్చిన గిరిజనులు (25) దరఖాస్తులను గిరిజనులు సమర్పించడం జరిగింది.కొట్టెం ముఖర్జీ ఆదివాసి హక్కుల పోరాట సమితి మహబూబాబాద్ జిల్లా-గూడూరు మండలంలోని మచ్చర్ల గ్రామం పంట పొలాల్లో కలవట్లు ఐటిడిఏ ద్వారా మంజూరు చేయుటకు, కొత్తగూడెం మండలం సీతానగరం గ్రామం నందు రైతులకు పోలాలకు పూవుటకు గాను గ్రావెల్ రోడ్డు ఐటీడీఏ ద్వారా మంజూరు కొరకు మరియు కుటుంబ ఉపాధి కొరకు సారీ సెంటర్ మంజూరు నిమిత్తం అయిలబోయిన సమ్మక్క గుడూరు గ్రామంనికి మంజూరి చేయుటకు కోరి ఉన్నారు.పెద్ది వెంకటయ్య మంగపేట మండలం మల్లూరు నాకు RoFR చట్టం 2006 నేను గిరిజ రైతు పోడు భూమి యొక్క హక్కు పత్రం నాకు ఇంకా మంజూరు కాలేదు నాకు మంజూరు చేయుటకు దరఖాస్తు చేసినారు.కొత్త సురేందర్ ఆదివాసీ నాయక పోడు సేవా సంఘం ములుగు డిస్ట్రిక్ట్ శ్రీ హేమచల నరసింహ స్వామి క్షేత్రాల పరిసర ప్రాంతాలలో చాలా దశాబ్దాలు గా నివసించిన ఆదిమ వాసులకు నాయక పోడు వారికి విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో వెనుకబడిన మాకు మా యొక్క భూములకు కేటాయించవలసిందిగా దరఖాస్తు చేసుకున్నారు.
ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోడెం బాబు అశోక్ నగర్ సైనిక్ స్కూల్ లో అడ్మిషన్ ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు.గొంది ప్రశాంతి నేను బిఎస్సి నర్సింగ్ కంప్లీట్ చేసుకుని ఉన్నాను నాకు వాజేడు మండలంలో పెద్ద గొల్లగూడెం గ్రామం.నాకు వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్ పోస్టు ఖాళీగా ఉంది నాకు ఆ పోస్టు ఇప్పించుట గూర్చి దరఖాస్తు చేసినారు.సూడే భీమమ్మ కన్నాయి గూడెం మండలం సర్వయి,చిట్యాల గ్రామానికి చెందిన షోడే భీమమ్మ,లక్ష్మి పోడియం బంధం లక్ష్మయ్య నాకు వృద్ధప్య పింఛన్ మంజూరు చేయుటకు దరఖాస్తు చేసినారు.కన్నాయి గూడెం మండలం చిట్యాల గ్రామానికి చెందిన చాట్ల నర్సయ్య నాకు రైతుబంధు ఇప్పించ గూర్చి దరఖాస్తు చేసుకున్నారు.కన్నాయిగూడెం మండలం చిట్యాల గ్రామానికి చెందిన కంఠం రాఘవులు నాకు ఐకేపి స్కీం ద్వారా బోరు వేసినారు.కరెంటు మోటారు ఇచ్చినారు త్రీఫేస్ కరెంటు మంజూరు చేయాలని కోరారు.
మహబూబాద్ జిల్లా మాధవ పురం గ్రామానికి చెందిన భూక్యా రాము నేను ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ వారి పేరుపై ఈఎండి తీసి ఉన్నాను నాకు నా యొక్క ఇఎండి డబ్బులు ఇప్పించుట గూర్చి దరఖాస్తు చేసినారు.కొత్తగూడెం,మండలం వేలుబల్లి గ్రామానికి చెందిన చాట్ల నాగేశ్వరరావు నేను అటవీ హక్కు కలిగిన భూమిపై గిరిజనులు తమ భూమి అని కొత్తగూడెం మండలంకు పిలిపించి అటవి అధికారులు బెదిరిస్తున్నారు.నాకు న్యాయం చేయడం కొరకు దరఖాస్తు చేసినారు. వెంకటాపురం మండలంలోని నూగురు గ్రామానికి చెందిన సూరటి పావని నాకు మీసేవ కేంద్రం మరియు జిరాక్స్ సెంటర్ ఏర్పాటు చేసుకొను టకు అనుమతి ఆర్థిక సహాయము చేయుట కొరకు దరఖాస్తు చేసినారు. వెంకటాపురం మండలం నూగురు గ్రామానికి చెందిన సూర్యటి మేడయ్యా నాయక్క వ్యవసాయ సాగు భూమిని చేదును చేసుకొను టకు జెసిబి పెట్టుకొనుటకు అనుమతి ఇప్పించుట గూర్చి దరఖాస్తు చేసుకున్నారు.కొత్త గూడ మండలం గోవిందాపురం మినీ గురుకులం లో గంగారం మండలంలో గల విద్యార్థులకు అడ్మిషన్ కల్పించుట గూర్చి గంగారం గ్రామస్తులు కోరినారు. ఏటూరు నాగారం మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన పెద్ది కిష్టయ్య నాయక వ్యవసా యానికి డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేయుటకు దరఖాస్తు చేసుకున్నారు. గోవిందరావుపేట మండలం తప్పవంచ గ్రామానికి చెందిన ఊకే వైష్ణవి నేను బీఈడీ అండ్ టెట్ క్వాలిఫై ఉన్నాను నాకు కాంట్రాక్ట్ పద్ధతిలో మ్యాథ మెటిక్స్,ఫిజిక్స్ బోధించుటకు అనుమతిం చుటకు దరఖాస్తు చేసి ఉన్నారు.వాజేడు మండలం గుమ్మడి దొడ్డి గ్రామానికి చెందిన పాయం రామదాసు నాకు నా యొక్క వ్యవసాయా నికి సాగు చేయుట కొరకు డ్రిప్ ఇరిగేషన్ మంజూరు నిమిత్తం దరఖాస్తు చేసి ఉన్నారు.కొత్తగూడ టీఎస్ ఈ ఎం ఆర్ ఎస్ లో అవుట్సో ర్సింగ్ పార్ట్ టైం నియామకాలు మాకు ఉద్యోగం అవకాశం కల్పించిలని జన్ను రమ,కల్తీ రవికుమార్ మోకాళ్ళ పూలమ్మ లక్ష్మి దరఖాస్తు చేసినారు . మంగపేట మండలం నర్సాయి గూడెం గ్రామ రైతులు మా యొక్క పెద్ద చెరువు తూము లీకేజీ,అలుగులు లీకేజీ రిపేరు చేయుట గురించి దరఖాస్తు చేసి ఉన్నారు. వాజేడు మండలం గుమ్మడి దొడ్డి గ్రామంలో గిరి వికాసం బోరు బావుల సర్వే చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని గుమ్మడిదొడ్డి గ్రామస్తులు కోరి ఉన్నారు. వెంకటాపురం మండలం పూజారి గూడెం పెసా గ్రామసభను వాయిదా వెయ్యాలని పూజారి గూడెం గ్రామస్తులు కోరినారు.
ఈ కార్యక్రమంలో ఏవో టీవి. దామోదర స్వామి,జిసిసి డిఎం ప్రతాప్ రెడ్డి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ కొరం క్రాంతి కుమార్, ప్రాజెక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ భారతి,పిఈటిసి ప్రిన్సిపాల్ శ్రీరాములు,ఏటూరు నాగారం
ఫారెస్ట్ అధికారులు,ఐటీడీఏ
మేనేజర్ శ్రీనివాస్,గ్రీవెన్స్ సెల్ లో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !