మన్యంన్యూస్ ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని 24 ఏరియా నందు గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఏడ్యుకేషనల్ సొసైటీ టీఎంఆర్ఎస్ బాలుర పాఠశాలలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఇంగ్లీష్ సబ్జెక్ట్ భోధించుటకు ఉపాధ్యాయ పోస్టు భర్తీకై స్థానిక గురుకుల ప్రిన్సిపాల్ కృష్ణ సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…ఆసక్తి గల అభ్యర్దులు దరఖాస్తు చేసుకొనుటకై ఎంఎ ఇంగ్లీష్, బీయెడ్ సంబంధిత సబ్జెక్టులో యాభైశాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని ప్రకటనలో తెలిపారు.18 నుంచి 44 సంవత్సరాల వయస్సుతో ఉండి మూడు నుంచి ఐదు సంవత్సరాల టీచింగ్ అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుందని ఆయన తెలిపారు. అభ్యర్దులు తమ దరఖాస్తును జూన్ ఒకటవ తారీఖు సాయంత్రం 4 గంటలలోపు ఇల్లందు 24 ఏరియాలోని టీఎంఆర్ఎస్ బాలుర -1 పాఠశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో సమర్పించాల్సిందిగా తెలిపారు. అభ్యర్దులు సంబంధిత సమాచారం కోసం 9110360408 నంబర్ కు సంప్రదించాల్సిందిగా ప్రకటనలో తెలిపారు.