మన్యం న్యూస్, దమ్మపేట, మే, 29: దమ్మపేట మండలం, కొమ్ముగూడెం గ్రామంలో సోమవారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం అధ్యక్షతన సోయం వంశస్తుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ముందుగా జమేదారు బంజర్ గ్రామంలో ఆదివాసి పోరాటయోధుడు సోయం గంగులు సమాధి వద్దా
పూలమాలలు వేసి సోయం గంగులకి ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం కొమ్ముగూడెం గ్రామంలో సోయం వీరభద్రం ఫామ్ ఆయిల్ తోట వద్ద ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ముందు ఆదివాసి పోరాట యోధులు కొమరం భీమ్, సోయం గంగులు చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం మాట్లాడుతూ నవీన అధునికరణ మూలంగా మనం జన్మించిన ఆదిమూలాలు సోయం వారి ఇలవేల్పుల చారిత్రక నేపథ్యం, విశిష్టత, గోత్రకూటమి వంటిి విషయాలు నేడు చాల మంది మరిచిపోతున్నామని ఆవేదనను వ్యక్తము తెలియజేసారు. సోయం వారి ఇలవేల్పులను పునరుద్దరణకు అంధరు ఏక తాటి పై రావాలి అని తద్వార ఆదివాసీ భాష, యాస, కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన అన్నారు. అదేవిధంగా జమేదార్ బంజర్ గ్రామానికీ చెందిన సోయం గంగులు నిజాం నిరంకుశత్వ పరిపాలన వ్యతిరేకంగా అప్పుడున్న పాల్వంచ, అశ్వారావుపేట ఏజెన్సీ సంస్థానాలలో ఆదివాసీ బిడ్డల భూమి, భుక్తి, పేద ప్రజల విముక్తి కోసం పోరాటం చేస్తు తెలంగాణ సాయుధ పోరాటం ఉద్యమం (1945-1951) సంవత్సరాలు పాల్గొని జమింధారి వ్యవస్థకు, పటేల్, పట్వారీ వ్యవస్థ వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన గొప్ప ఆదివాసీ పోరాట యోధుని స్ఫూర్తిని ఇప్పటికి కూడా చరిత్రలో కాని పాట్యంశాలల్లో కనీసం పేజీ కూడా లేకపోవడం అనేది బాధాకరమని, సోయం వంశీయులంతా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని భవిష్యత్తులో సోయం వారి ఇలవేల్పులైన గడి కామరాజు, మూలరాజు, గంటలరాజు, పారేడుఘట్టు గోత్రవంశీయులు సుమారు 200 మంది ప్రతినిధులు పాల్గొని వారి యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకోవాలని భవిష్యత్తులో సోయం గంగులకి తగిన గుర్తింపు ఇచ్చి అదిలాబాదులో ఆదివాసి పోరాటయోధుడు కొమరం భీమ్ కి స్ఫూర్తి కేంద్రాన్ని కేటాయించినట్లు గంగులు కి కూడా వారి యొక్క చరిత్రను భావితరాలకు తెలిసే విధంగా ఆజాదికా అమృత మహోత్సవాల పేరుతో ఆదివాసి పోరాట యోధులను గుర్తించకుండా ఆదివాసీ చరిత్రను విస్మరిస్తున్నారని. కనుమరుగైపోతున్నటువంటి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను పటిష్టంగా కాపాడాలని దానిలో భాగంగానే వంశీయుల యొక్క ఇలవేల్పులను విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకున్నప్పుడు మాత్రమే ఉనికికి మనుగడ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి తలపతులు వివిధ రంగాలలో పనిచేస్తున్న సోయం వంశీయులందరూ కార్యక్రమంలో పాల్గొని ఈ ఆత్మీయ సమ్మేళనం మొట్టమొదటిసారిగా సోయం గంగుల యొక్క వారసులు అందరూ కలిసి ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉన్నదని భవిష్యత్తులో అన్ని రంగాలలో వంశీయులు ముందుకు వెళ్లాలని ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రైతులు మహిళలు కార్యకర్తలు విద్యార్థులు వివిధ పార్టీలకు చెందిన వంశీయుల రాజకీయ నాయకులు పాల్గొన్నారు అని సోయం వారి ఆత్మీయ సమ్మేళన నిర్వహణ బాధ్యులు సోయం వీరభద్రం పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి తెగల సమన్వయకర్త ఇరు రాష్ట్రాల నాయకులు సోయం కన్నారాజు, ములకలపల్లి దమ్మపేట, అశ్వాపురం, అశ్వరావుపేట, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి సోయం వంశీయుల యొక్క ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక ఎంపీపీ సోయం ప్రసాద్ మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనం చాలా ఆనందంగా అనిపించిందని భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలియజేశారు, గంగుల యొక్క వారసత్వం పోతురాజు మాట్లాడుతూ 75 సంవత్సరాల తర్వాత సోయం వంశీయుల ద్వారా ఈ సమ్మేలన కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం అని భవిష్యత్తులో గంగులు కి తగిన స్థానం చరిత్రలో ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోయం బాబురావు (చిన్నారి), సత్యనారాయణ, కోటేశ్వరరావు, బిక్షమయ్య, సురేష్, నాగబాబు, అప్పారావు, నాగేశ్వరరావు, నర్సింహారావు, బాలరాజు, మంగ తయారు తదితరులు పాల్గొన్నారు.