మన్యం న్యూస్ అశ్వాపురం:మే 29
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం లోని ఆనందపురం గ్రామం లో మండల జెడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ,గోపి రెడ్డి నివాసం లో ఏర్పాటు చేసిన తినేటి విందుకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హాజరైయ్యారు.ఈ సందర్బంగా వారు ఏర్పాటు చేసిన తేనీటి విందు నీ వారు స్వీకరించారు. అనంతరం జెడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ,గోపి రెడ్డి దంపతులు, మండల ప్రజాప్రతినిధులు,జిల్లా నాయకులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను శాలువా తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కురాకల.నాగభూషణం,జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజేందర్, అశ్వాపురం మండల ప్రజా ప్రతినిధులు,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి భవాని శంకర్,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.