UPDATES  

 11వ వేతన ఒప్పందం చరిత్రాత్మకం

 

మన్యంన్యూస్ ఇల్లందు:- కోల్ మైన్ కార్మికుల ప్రయోజనం చేకూర్చే 11వ వేతన సవరణ ఒప్పందం తీసుకురావడంలో విజయం సాధించడంతో ఇల్లందు బిఎంఎస్ కార్యాలయం నందు కేఓసి ఏరియా సెక్రెటరీ లీలాకృష్ణ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఏబికేఎంఎస్ కార్యదర్శి పి మాధవ నాయక్ బిఎంఎస్ జాతీయ నాయకులు లక్ష్మా రెడ్డి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జేబీసీసీఐ కమిటీని ఏర్పాటు చేయడం ఒక చారిత్రాత్మకం అన్నారు. కార్మికులు సమ్మెలు చేయకుండా ఉత్పత్తికి నష్టం జరగకుండా కార్మికులు ఆర్థికంగా నష్టం పోకుండా సాధించిన వేతన సవరణ ఒప్పందం హర్షణీయం అని పేర్కొన్నారు.19 శాతం మినిమం గ్యారెంటీతో అన్ని అలవెన్స్ లపై 25% పెరుగుదలను సాధించటం కూడా చారిత్రాత్మకమని తెలియజేశారు. ఇంక్రిమెంట్ మూడు శాతం కొనసాగింపు స్పెషల్ అలవెన్స్ నాలుగు శాతం నుండి ఐదుశాతంతో పాటు ఈసారి అగ్రిమెంట్ లో కార్మికులకి పేటర్నటి లీవులు 5, అదనంగా అంబేద్కర్ జయంతి రోజున వేతనంతో కూడుకున్న సెలవు దినం సాధించడంతో పాటు ఎల్టీసి ఎనిమిది నుండి పదివేలు మరియు ఎల్ఎల్టీసి 12నుండీ 15వేలకు అండర్ గ్రౌండ్ అలవెన్స్ 8శాతం నుండి 11.25% పెంచుకోవడం జరిగిందని తెలిపారు. హెచ్ఎంఎస్ నాయకులు అవగాహన రాహిత్యంతో, దిగజారుడుతనంతో, బాధ్యత రహితంగా, వేజ్ బోర్డు చర్చల్లోనూ అసంబద్ధంగా మాట్లాడటం క్రమశిక్షణ లేకపోవడం వాళ్ల జేష్ట నాయకత్వంపై విశ్వాసం లేకపోవడంతో వేజ్ బోర్డు ఏర్పాటు ఆలస్యం అయిందన్నారు. బిఎంఎస్ పై బురద జల్లడం మానుకోవాలని హెచ్చరించారు. అనంతరం 11వ వేతన ఒప్పందం కార్మికులకు లాభసాటిగా సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ బీఎమ్మెస్ నాయకులు పి మాధవ నాయక్ ను కోయాగుడేం ఉద్యోగులు మరియు గిరిజన, కార్మిక సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి ఆరుట్ల మాధవరెడ్డి, ఏరియా ఉపాధ్యక్షులు నాయిని సైదులు, కార్పొరేట్ ఏరియా సెక్రటరీ ఊట్ల గణేష్, ఏస్సిఎంసిఎంఎస్ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, శ్రీనివాస్ అహ్మద్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !