మన్యం న్యూస్, దుమ్ముగూడెం మే 29::
సిపిఎం పార్టీ నాయకులు గుడ్ల శివరావు స్ఫూర్తితో ఉద్యమించి వారి ఆశయాలను కొనసాగించాలని రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు మండలంలోని లక్ష్మి నగరం ఎస్బిఐ బ్యాంకు దగ్గర ఉన్నటువంటి సీతారామయ్య గుడ్ల శివరావు స్థూపాల వద్ద 11వ వర్ధంతిని ఘనంగా నిర్వహించి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసిన మహనీయుడు శివరావు అని ప్రాణం ఉన్నంతవరకు పేద ప్రజలు కోసం పోరాడారని వలస ఆదివాసుల భూ సమస్య పరిష్కారం కోసం వెళ్లి ఎండ దెబ్బ తగిలి మరణించారని సీతారామయ్య అడుగుజాడల్లో నిలిచి అనేక ఉద్యమాల్లో ముందుండి నడిపించిన మహానీయుడు శివరావుని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎలమంచి రవికుమార్ భద్రాచలం నియోజకవర్గం కో కన్వీనర్ కారం పుల్లయ్య జిల్లా కమిటీ సభ్యులు చంద్రయ్య చిలకమ్మా శ్రీనుబాబు సాయి రెడ్డి తాతారావు అంజిరెడ్డి ఎలమంచి చిన్నబాబు ఉపసర్పంచ్ రామ్మోహన్ రెడ్డి సతీష్ తదితరులు పాల్గొన్నారు