మన్యంన్యూస్ ఇల్లందురూరల్: ఇల్లందు మండలం లచ్చగూడెం పంచాయితీ స్థాయి సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జనరల్ బాడీ సోమవారం కొమ్ముగూడెంలో జరపల శంకర్ అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు యకయ్యా, ప్రసాద్, సంగయ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వస్తే పోడు భూములకు పట్టాలు వస్తాయనే ఆశతో ప్రజలు ఉన్నారని,ఇవ్వాళ ఇస్తాం, రేపు ఇస్తాం అంటూ అనేకసార్లు ప్రకటనలు చేసి తీరా ఇప్పుడు సాగు దారులు అందరికీ ఇచ్చే పరిస్థితి లేదని,కొందరికి ఇచ్చి చేతులు దులుపు కుందామనీ ప్రభుత్వం చూస్తుందని అన్నారు. ఈ చర్య దుర్మార్గమైన ప్రభుత్వ విధానానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం పోడు సాగు దారులకు షరతులు లేకుండా హక్కు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బొగ్గారపు వెంకన్న, అజ్మీర రమణయ్య, కమటంమాధవరావు, జరుపల చంద్రు, గన్యా, రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు.