మన్యంన్యూస్,ఇల్లందు:టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామపంచాయతీ అయ్యప్ప ఆలయ భక్తమండలి వారి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి ఆలయ శిలాస్థాపన మరియు భూమిపూజ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కేరళ పూజారి బ్రహ్మశ్రీ మాధవన్ నంబూద్రిచే ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి తీర్థ ప్రసాదాన్ని ఎమ్మెల్యే స్వీకరించటం జరిగింది.
అనంతరం అయ్యప్ప ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బోడ బాలు, నాయకులు బానోత్ రామనాయక్, చీమల సత్యనారాయణ, దళపతి శ్రీనివాస్, ధరావత్ బాలాజీ, జరుపుల లచ్చు, బర్మావత్ శివకృష్ణ, జాటోత్ నరేష్, బానోత్ రవి, బానోత్ రవీందర్, గుగులోత్ కృష్ణ, ఉండేటి బసవయ్య, గంగారపు రమేష్, చీమల రామకృష్ణ, కిన్నెర శ్రీను, కొండబత్తుల శ్యామ్, కుమ్మరి చౌదరి, మాలోత్ భీముడు, నర్సింహా, రాములు, సత్తు, ఆలయకమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.