- ఆడిన మాట తప్పనివాడు!
- అభివృద్ధి సంక్షేమం ఆయనకు రెండు కళ్ళు
- మాజీలు అధిక ప్రసంగాలు, యాత్రలు మానుకోవాలి.
- జూన్ 24న రేగా చేతుల మీదుగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం
- రేగాను ఆశీర్వదించండి : బిఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధికార ప్రతినిధి -కోలేటి భవాని శంకర్
మన్యం న్యూస్, పినపాక:
అదిలాబాద్ నుండి అశ్వరావుపేట వరకు ఉన్న పోడు భూముల సమస్యను పరిష్కారం చేయాలని, పోడు సాగు చేసుకుంటున్న ప్రతి గిరిజన ఆదివాసి కుటుంబానికి పోడు భూములు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు చేసిన కృషి ఫలితంగా వేలాది మంది పోడు రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు పట్టాలను మంజూరు చేయటం హర్షనీయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి సోమవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలియజేశారు. పోడు పట్టాలు తయారు చేయించి, పట్టాలతో పాటుగా రైతుబంధు పథకం కూడా వర్తింపజేస్తున్నందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనులకు గిరి వికాస్ పథకం ద్వారా బోర్లు, త్రీఫేస్ కరెంటు ఇప్పించడానికి స్థానిక శాసన సభ్యులు రేగా కాంతారావు ఎంతో కృషి చేశారన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగిపోత