- అభివృద్ధి,సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం
- మణుగూరు లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్,రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతరావు
మన్యం న్యూస్ మణుగూరు టౌన్ మే 29
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు. మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా గుట్ట మల్లారం గ్రామం లో 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఆర్టీవో యూనిట్ కార్యాలయ నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ నుండి కోడి పుంజుల వాగు వరకు ఆర్ అండ్ బి రోడ్డుకు ఇరువైపులా 2 కోట్ల 60 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.అంబేద్కర్ సెంటర్ నుండి చినరావి గూడెం మీదగా నెల్లిపాక వరకు రహదారి విస్తరణ పనులకు సుమారు 2 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ,అభివృద్ధి,సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.పేద ప్రజల సంక్షేమం వారికి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి,సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు.కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి గ్రామాలను,పట్టణాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా,జరుగుతున్నాయన్నారు.రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,మండలంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా,పరిష్కరిస్తున్నామని వారు తెలిపారు.ఇందులో భాగంగా మణుగూరు ప్రజల ఎన్నో ఏళ్ల కల ఆర్టీవో ఆఫీస్ నూతన భవనానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు.అంబేద్కర్ సెంటర్ నుండి కోడి పుంజుల వాగు వరకు,అంబేద్కర్ సెంటర్ నుండి చినరావి గూడెం రహదారి విస్తరణ పనులకు మంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని అన్ని గ్రామాలను పట్టణాలను కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు,చేపడుతున్నారన్నారు.ఇందులో భాగంగా మండలంలో సుమారు 3 కోట్ల రూపాయల తో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.భవిష్యత్తులో మణుగూరు ను అభివృద్ధిలో జిల్లాలోని మొదటి స్థానంలో నిలుపుతామన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల.నాగ భూషణం,జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల.రాజేందర్, స్థానిక జడ్పిటిసి పోశం. నరసింహారావు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, ఎంపిటిసిల సంఘం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, ఎంపిటిసిలు బాబురావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, స్థానిక సర్పంచులు బచ్చల భారతి,కారం ముత్తయ్య, జంపేశ్వరి,రజిత,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శులు రామిరెడ్డి,నవీన్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు, యువజన నాయకులు, బిఆర్ఎస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.