కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ సీట్లపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుందని అన్నారు. అందుకు తగ్గట్లుగానే ఆధునిక వసతులతో కొత్త భవానాన్ని నిర్మించామని తెలిపారు. ప్రస్తుత పార్లమెంట్ ను 1,272 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా నిర్మించామని వెల్లడించారు.