UPDATES  

 అయ్యో పాయం ఇక చాలు ఆదివాసులపై కపట ప్రేమ

  • అయ్యో పాయం ఇక చాలు ఆదివాసులపై కపట ప్రేమ
  • ఎక్కువగా మాట్లాడితే మీ పరువే పోతుంది. పోడు పట్టాల
  • సాధనలో తొలి కేక రేగాదే
  • బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్

మన్యం న్యూస్ గుండాల…గిరిజనులపై పాయం వెంకటేశ్వర్లు కపట ప్రేమ చూపిస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017 సంవత్సరంలో ఫారెస్ట్ అధికారులు 70 హెక్టార్లను హరితహారం పేరుతో తీసుకుంటే అధికారంలో ఉండి కూడా ఆపలేకపోయాడని అన్నారు. ఇప్పటికే పోడు భూములకు ప్రభుత్వం పట్టాలను సిద్ధం చేసి పంపిణీ చేయాలని నిర్ణయించిన తర్వాత పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ధర్నాలు చేస్తుంటే హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీ ఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాల పాలనలో పాయం వెంకటేశ్వర్లు కూడా నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నాడని అప్పుడు గిరిజనులు గుర్తు రాలేదు కానీ పార్టీ నుంచి బయటికి రాగానే వాళ్లందరూ గుర్తుకొస్తున్నారని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని రైతులు ఇప్పుడు గుర్తుకు వచ్చి రైతు భరోసా యాత్రలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. గతంలో నియోజకవర్గంలో కానీ  గుండాల మండలంలో ఒక్క అంతర్గత రహదారిని మంజూరు చేయలేక పోయావని కానీ ఇప్పుడు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చేసిన అభివృద్ధిని తనదని చెప్పడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తన పదవిని సైతం లెక్కచేయకుండా ముఖ్యమంత్రితో యుద్ధానికి దిగి పోడు భూముల పట్టా జీవోను తీసుకువచ్చి నేడు పోడు భూముల పట్టాల పంపిణీ చేపడుతున్నారని అన్నారు. మొత్తం నియోజకవర్గంలో 15 వేల కుటుంబాలకు అతి త్వరలో పోడు పట్టాలను పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గుండాల మండలంలో అభివృద్ధి జరుగుతుంటే దానిని తట్టుకోలేక కల్లబొల్లి మాటలు చెబుతూ గ్రామాలలో తిరుగుతూ కపట ప్రేమ చూపిస్తున్నావని ఆయన పేర్కొన్నారు. నీ కపట ప్రేమను గుండాల మండల ప్రజలు ఏనాటికి నమ్మరని హితువు పలికారు. అభివృద్ధి అంటే ఎమ్మెల్యే రేగా కాంతారావు తోనే సాధ్యమని ఇప్పటికే మండల ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారని ఆయన పేర్కొన్నారు. పేద ప్రజలకు ఏదైనా చేయాలంటే ఒక రేగా కే సాధ్యమని ఆయన అన్నారు. గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా పనిచేసి ఎక్కడ అభివృద్ధి చేశారు చూపించాలని సవాలు విసిరారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే విమర్శలకు దిగుతున్నావని ఆయన అన్నారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అఖండ మెజార్టీ సాధించి రేగా కాంతారావు మరో మారు ఎమ్మెల్యే కావడం తద్యమనిఆయన పేర్కొన్నారు. గతంలో రేగా కాంతారావు దయా దాక్షాణాలతో గెలిచిన వారు రేగా ను ఇప్పుడు విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లినట్లు ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్టా రాములు, నాయకులు తాటి కృష్ణ , బొమ్మెర్ల సతీష్ , ఈసం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !