- తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
- జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ హర్షనీయం
- రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను సత్కరించిన పంచాయతీ కార్యదర్శులు
మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 30
మణుగూరు లో జూనియర్ గ్రామపంచాయతీ కార్యదర్శుల సర్వీస్ క్రమబద్ధీకరణకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను జెపిఎస్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ కు,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విప్ రేగా కు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ, జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులర్ ప్రక్రియ చేపట్టడం హర్షణీయమని అన్నారు.సీఎం కేసిఆర్ మనసున్న మహారాజు అనీ విప్ రేగా కొనియాడారు.సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. నివేదికల రాగానే జెపిఎస్ ల రెగ్యులర్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.