UPDATES  

 ఉరిమే ఉత్సాహంగా.. ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు పల్లె పల్లెలో సంబరంగా దశాబ్ది వేడుకలు

  • ఉరిమే ఉత్సాహంగా..
    ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు
  • పల్లె పల్లెలో సంబరంగా దశాబ్ది వేడుకలు

    పదేళ్ల ప్రగతిని సగర్వంగా చెప్పుకుందాం

  • ప్రభుత్వ అభివృద్ధి పై ఫోటో గ్యాలరీ ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి
  • జూన్ 2 నుంచి 22 వరకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
  • రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ సమీక్ష సమావేశంలో

-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 30
మణుగూరు మండలం లోని గుట్ట మల్లారం హనుమాన్ ఫంక్షన్ నందు మంగళవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పై పినపాక నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు,అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సంధర్బంగా విప్ రేగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 21 రోజులపాటు పండగలా నిర్వహించాలన్నారు.సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు,ప్రజాప్రతినిధులు ప్రజలను భాగస్వాములను చేస్తూ,పదేళ్ల ప్రగతి,సాధించిన విజయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించి 10 ఏండ్లు అయిన సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు.పండుగ వాతావరణం లో రోజుకో కార్యక్రమం చొప్పున 21 రోజుల పాటు తెలంగాణ సాధించిన విజయాలను ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.దశాబ్ది ఉత్సవాలు పల్లె పల్లెలలో జరగాలని ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ గ్రామాలలో ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాలలో పదేళ్లలో సాధించిన ప్రగతి,అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు.తెలంగాణ ఆవిర్భావం ముందు తర్వాత జరిగిన అభివృద్ధి,ప్రస్తుతం రాష్ట్రంలో అమలుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా ఆయా శాఖ అధికారులు ఫోటో ఎగ్జిబిషన్ వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టాలన్నారు.ప్రభుత్వ పథకాలను గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. కార్యక్రమాలలో మహిళా సంఘాలు,మహిళలను భాగస్వాములను చేయాలన్నారు.గ్రామాలలో మౌలిక సదుపాయాలు, నర్సరీలు,డంపింగ్ యార్డులు, కల్లాలు,రైతు వేదికలు,స్మశాన వాటికలు,పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె పకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామన్నారు.అభివృద్ధిపై గ్రామాలలో దండోరాలు వేసి ఉత్సవాలను నిర్వహించాలని తెలిపారు.అధికారులు,ప్రజా ప్రతినిధులు,ఆయా శాఖల వారీగా సమన్వయంతో దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో జడ్పిటిసి లు పోశం. నరసింహారావు,సూదిరెడ్డీ సులక్షణ,ఎంపీపీలు గుమ్మడి గాంధీ,రేగా కాళిక,మంజు భార్గవి,ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య,నియోజవర్గ ప్రజాప్రతినిధులు,పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !