- సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు ఆహ్వానం
- జనరల్ మేనేజర్ దుర్గం.రామ చందర్
మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 30
మణుగూరు మండలం లోని పీవీ కాలనీ లోని జూన్ 5వ తేదీ నాడు భద్రాద్రి స్టేడియం నందు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను ముఖ్య అతిథిగా హాజరు కావాలని మణుగూరు సింగరేణి జనరల్ మేనేజర్ దుర్గం.రామచందర్ విప్ రేగా కు ఆహ్వానాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏజీఎం సివిల్ డి.వెంకటేశ్వర్లు, డీజీఎం పర్సన్ ఎస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.