మన్యం న్యూస్, దమ్మపేట, మే, 30: దమ్మపేట మండల పోలీస్ స్టేషన్ లో ఇటీవలే ఎస్.ఐ గా భాధ్యతలు స్వీకరించిన రవికుమార్ నీ పోలీసు స్టేషన్ లో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసారు. నూతనంగా ఎస్సై బాధితులు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్ఐ రవికుమార్ కి శాలువ కప్పి సన్మాన కార్యక్రమం నిర్వహించి, ఎస్.ఐ రవికుమార్ తో కొద్దిసేపు ముచ్చటించారు. న్యాయంను ఆశ్రయించి పోలీసు స్టేషన్ వచ్చిన భాధితులకు సత్వరమగ కేసులు విచారణ చేసి న్యాయం చెయ్యాలని జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ గంటా వెంకటేశ్వరరావు, జోనుబోయినా సుబ్బారావు, సోయం గోపి తదితరులు పాల్గొన్నారు.