మన్యంన్యూస్ ఇల్లందురూరల్:-
లైంగిక వేధింపులకు పాల్పడిన బిజేపీ ఎంపి బ్రిజ్ భూషన్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ, మహిళా రెజ్లర్స్ కు మద్దతుగా ఇల్లందు మండలం బొజ్జయి గూడెంలో పిఓడబ్ల్యు, పివైఎల్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయటం జరిగింది.ఈ సందర్బంగా పివైఎల్ నాయకులు మోకాళ్ళ రమేష్ మాట్లాడుతూ మహిళా మల్లయోధులు తమపై జరిగిన లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదుచేసి అరెస్టుచేయాలని డిమాండ్ చేస్తూ గత ఐదు నెలలుగా శాంతియుతంగా చేస్తున్న ఆందోళనను పరిష్కరించకుండా మోడి ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరిని అనుసరిస్తుoదని అన్నారు.దేశ విదేశాలలో మహిళా రెజ్లర్లు జాతీయ అంతర్జాతీయ పోటీలలో పాల్గొని ఎన్నో పథకాలను సాధించి భారతదేశానికి పేరు ప్రతిష్టలను సంపాదించారని అన్నారు. కార్యక్రమంలో రావూరి ఉపేందర్‌రావు, బొర్ర రమేష్, చీమలరుక్మిణి, దేవి, ఉమా, శ్రీదేవి, కల్తీలక్ష్మి, చీమలభద్రమ్మ, సోలo భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.