ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..
మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన కేంద్ర వైదృ బృందం..
మన్యం న్యూస్ దుమ్ముగూడెం మే 29::
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే అంకితభావంతో పనిచేయాలని కేంద్ర వైద్య బృందం డాక్టర్లు తెలిపారు. సోమవారం మండలంలోని ములకపాడు 24 గంటల ఆసుపత్రి, పర్ణశాల, నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వారు సందర్శించారు. పీహెచ్ సీలో అందుతున్న వైద్య సేవలను డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. సబ్ సెంటర్లు హెల్త్ వెల్ నెస్ సెంటర్ అన్ని స్థాయిలలో జన ఆరోగ్య సమితి కమిటీలను ఏర్పాటు జరిగినట్టు, నిబంధనలు అనుసరిస్తూ క్రమం తప్పకుండా ప్రతీ నెల సమావేశాలు నిర్వహిస్తూ,ప్రజలకు అందుతున్న వైద్య సేవల తీరును క్షుణ్ణంగా సమీక్షించాలని సూచించారు. ఆస్పత్రిలో నీటి వసతి సానిటేషన్ పరిసరాల పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కేంద్ర వైద్య బృందం డాక్టర్లు బాలసుబ్రమణ్యం, డాక్టర్ అనంత పద్మనాభ బట్టు, సాహిద్ ఆలీ వర్సి, భద్రాది కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్వో డాక్టర్ శిరీష ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డాక్టర్ బాలాజీ నాయక్ నరసాపురం డాక్టర్ చైతన్య దుమ్ముగూడెం డాక్టర్ పుల్లారెడ్డి పర్ణశాల డాక్టర్ రేణుక రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.