- 13 కోట్ల 80 లక్షల రూపాయల తో అభివృద్ధి పనులు
- శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ అజయ్,విప్ రేగా కాంతరావు
మన్యం న్యూస్ ఆశ్వాపురం: మే 29
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలంలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ.అజయ్ కుమార్,రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పర్యటించారు.ఈ సందర్భంగా మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్ధాపన చేశారు.అందులో భాగంగా నెల్లిపాక బంజర రాళ్ల వాగు వద్ద 1 కోటి 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న బ్రిడ్జి పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,శంకుస్థాపన చేశారు. అనంతరం మండలంలోని తుమ్మల చెరువు గ్రామ పంచాయతీ లో సుమారు 5 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న లోతు వాగు బ్రిడ్జి పనులకు వారు శంకుస్థాపన చేశారు.గొందిగూడెం గ్రామ పంచాయతీ లో 7 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న ఇసుక వాగు బ్రిడ్జి పనులకు మంత్రి పువ్వాడ విప్, రేగాతో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల.నాగ భూషణం,జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల.రాజేందర్, జెడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ, వైసిపి కంచుగట్ల వీరభద్రం, స్ధానిక ప్రజా ప్రతినిధులు,జిల్లా ఉన్నత అధికారులు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్,నాయకులు కందుల కృష్ణార్జున రావు, వెంకటేశ్వర్లు,చిలకల.వెంకటరామయ్య,పాయం భద్రయ్య, మహిళా నాయకులు దుర్గ. భవాని,తోకల.లత,పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.