UPDATES  

 వేల్పుల జాతర్లను కాపాడుకుందాం*

వేల్పుల జాతర్లను కాపాడుకుందాం*

*కాసాల నాయుని వేల్పు జాతర పూర్వ చరిత్ర పై బిర్స ముండా రీసెర్చ్ సెంటర్ అధ్యయనం.

*తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి.అరుణ్ కుమార్ పిలుపు.

మన్యం న్యూస్ ఏటూరు నాగారం
గంగారం మండల కేంద్రంలోని గుడిపాడు గుంపు లో గల చింత వారి వేల్పు కాసల నాయిని వేల్పు జాతర పూర్వ చరిత్ర పై బిరస ముండా రీసెర్చ్ సెంటర్ బృందం అధ్యయనం నిర్వహించింది. మినిస్ట్రీ ఆప్ ట్రైబల్ అఫైర్స్ నూడిల్లి వారు పార్ట్ ఆఫ్ మేడారం క్రింద కమిషనర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ తెలంగాణ కు 10 కోయ వేల్పు జాతరల పై చరిత్ర అధ్యయనం కోసం ఇచ్చిన వర్క్ లో బాగంగా ఐటీడీఏ ఏటూరు నాగారం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ పరిశోధన ను కొనసాగిస్తున్నాము అని బృందం తెలిపింది.ఇక్కడ గ్రామ పెద్దలు తాలపతులు వడ్డేలు యువ ఉద్యోగస్తుల తో సుదీర్ఘంగా చర్చించిన బృందం అనేక వివరాలు సేకరణ చేసింది.అనంతరం పరిశోదన విద్యార్థి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ. గోదావరి పరివాహక ప్రాంతం లో 3 నుంచి 7 గొట్ల కు సంబందించిన కోయ ప్రజల వేల్పు జాతరలు మొత్తం 150 ఉన్నట్టు పరిశోదన బృందం గుర్తించింది అని ఈ వేల్పు జాతరలు పకృతి అనుసంధాన జాతరలు అని అన్నారు.ఈ వేల్పు జాతరలు చరిత్ర ను బ్రతికించటం లో బాగంగా అధ్యయనాలు గత 10 సంవత్సరాలు గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు, దానిలో భాగంగా ఈ జాతర అధ్యయనం కోసం వచ్చినట్టు తెలిపారు.ప్రభుత్వం కూడా మేడారం జాతర కు కేటాయించే నిధులలో ఈ ఏడాది ఈ జాతరల కు కూడా ప్రత్యేక నిధులు కేటాయించి ఆదివాసీ వేల్పు జాతరలను రక్షించాలని అన్నారు.హిందూ క్రైస్తవ ఇతర మతాలకు కోట్ల రూపాయలు కేటాయిస్తున్న ప్రభుత్వాలు వెనుక బడిన దట్టమైన అడవులలో గల ఆదివాసీల జాతరలు పట్ల చిన్న చూపు చూస్తుంది అని అన్నారు, ఆదివాసీ పండుగలు కూడా నేడు బయటికి తీసుకొచ్చి అభివృధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది అన్నారు.
సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా లోనే అతి పెద్ద జాతర అని ఆ సమ్మక్క తమ్ముడే కాసలా నాయుడు అని అన్నాడు అందుకే రాయి బండాని వంశం లోని సమ్మక్క ని చందా వంశీయులు కొలిస్తే చింత వారు మాత్రం సమ్మక్క తమ్ముడు అయిన కాసల నాయుడు నీ వేల్పు గా పూర్వం నుంచి కొలుస్తున్నట్లు తెలిపారు.ఈ జాతర మేడారం జాతర తిరుగివారం హోలీ పున్నమిలో జరుగుతుంది అని శని,అది,సోమ వారాలలో ఈ జాతర నిర్వహణ చేసి జాతర చివరి రోజు కాసల నాయిని కట్ల ఆధారంగా పకృతి నీ అంచనా వేసి వర్షాలు ఏ కార్తి లో పడుతాయి ఏ కార్తి లో పడవు అనే పకృతి అంచనా కూడా ఈ జాతరలో అంచనా వేసి పకృతి నీ ఆరాధించే గొప్ప జాతర అని అన్నారు.ఆదివాసీ సంస్కృతిలోని శాస్త్రీయ త ఉంది అని ఆధునిక ఆదివాసీ సమాజం యువత విద్యార్థులు మన సంస్కృతి రక్షణ వైపు ప్రయాణం చేయాలని పిలునిచారు.ఈ పరిశోదన లో రీసెర్చ్ సెంటర్ ఇంఛార్జి కొమరం జ్యోతిష్ సభ్యులు కాక శ్వేత, కాక నవ్య, పాయం నందిని తలపతి చింత వజ్జయ్య వడ్డే యప బిక్ష పతి, చింత సతీష్ పెద్ద మనుషులు, సిద్ధ బోయిన లక్ష్మయ్య, జెజ్జరి నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !