UPDATES  

 చేసిన అభివృద్ధిని సగర్వంగా చెప్పుకుందాం రాష్ట్రం గర్వించేలా దశాబ్ది ఉత్సవాలు

  • చేసిన అభివృద్ధిని సగర్వంగా చెప్పుకుందాం
  • రాష్ట్రం గర్వించేలా దశాబ్ది ఉత్సవాలు
  • ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి
  • పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే వనమా సమీక్ష

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధితోపాటు సమకూర్చిన సంక్షేమ పలాలను ప్రజలకు వివరించడంలో ఎలాంటి సంకోచం లేదని సగరువంగా అభివృద్ధిని చెప్పుకునేలా దశాబ్ది ఉత్సవాలు నింగికి అంటాలని అందుకోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములే ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెంలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి అంటే కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన పరిజ్ఞానానికి నిదర్శనం అన్నారు. జూన్ రెండో తేదీ నుంచి 22వ తేదీ వరకు జరిగే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు దద్దరిల కొత్తగూడెం నియోజకవర్గం లో వాడవాడల గ్రామ గ్రామంలో పండగ వాతావరంలో జరుపుకోవాలని అందుకు ప్రజా ప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. మనసున్న మారాజు ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల పట్టాల మంజూరు విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని దశాబ్ది ఉత్సవాల సాక్షిగా పోడు భూములకు పట్టాలు మంజూరు చేసి కానుకగా అందించేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. ప్రస్తుతం కొందరు పగటివేష గాళ్లు పోడు భూముల పట్టాల విషయంలో అనాలోచితంగా ఆలోచించి పోడు రైతులను పక్కదారి పట్టించి వారి రాజకీయ ఎత్తుగడలతో అధికారాన్ని చేది ఎక్కించుకోవాలని చూస్తున్నారని అలాంటి దద్దమ్మల పప్పులు ఉడకవని స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 5000 మందికి పోడు భూముల పట్టాలు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అందజేస్తారని స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ల కెసిఆర్ పానాలలో విమర్శలకు తావు లేదని ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ అడ్డదారిలో అధికారాన్ని చేతికిచ్చుకునేందుకు లేచిపోని బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ప్రజలు వారిని తిప్పిగొట్టే సమయం ఆసన్న అయిందని స్పష్టం చేశారు. లేనిపోని ప్రజలు బాలే ప్రభుత్వం కాదని ప్రజల పక్షాన నిలబడి అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ఆర్థిక స్వావలంబన దిశగా తెలంగాణ ప్రజలను ముందుకు నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని అన్నారు జరగబోయే దశాబ్ది ఉత్సవాలు గ్రామంలో కన్నుల పండుగగా జరగాలని ఆకాంక్షించారు. సమావేశంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, ఎంపీపీలు, బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !