UPDATES  

 సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంబించునున్న ఎమ్మెల్యే మెచ్చా

సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంబించునున్న ఎమ్మెల్యే మెచ్చా

ప్రజా ప్రతినిధులు, మండల నాయుకులు అందరూ హాజరు కావాలి -ఎంపీపీ జల్లిపల్లి

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 31: అశ్వారావుపేట నియోజక వర్గ కేంద్రమైన అశ్వారావుపేట పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనులు తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున ముఖ్య అతిధిగా అశ్వారావుపేట నియోజక వర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వర రావు పాల్గొని ప్రారంభిస్తారని ఎంపీపీ జల్లిపల్లి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఎన్నో సంవత్సరాల అశ్వారావుపేట మండల ప్రజల కలను అశ్వారావుపేట నియోజక అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావుతో సాకారం అవుతుందని, జూన్ 2 వ తేదీ శుక్రవారం నాడు ఉదయం 9 గంటలకు స్థానిక రింగ్ రోడ్ సెంటర్ నందు కొబ్బరికాయ కొట్టి సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంబిస్తారని ఎంపీపీ జల్లిపల్లి తెలిపారు. కావున ఈ ఒక్క కార్యక్రమానికి అశ్వారావుపేట మండల ప్రజలు, ప్రజా ప్రతినిధుల, మండల నాయకులు, అన్ని పార్టీల నాయకులు, అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నట్లు ఎంపీపీ జల్లిపల్లి తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !