మన్యం న్యూస్ మణుగూరు టౌన్ మే 31
మణుగూరు మండలం లోని సమితి సింగారం గ్రామానికి చెందిన మండల ఎంపీపీ కారం. విజయ కుమారి ప్రధానం వేడుకకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ విజయ్ కుమారి కి విప్ రేగా శుభాకాంక్షలు తెలిపారు. కాబోయే నూతన వధువును అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం లో జడ్పిటిసి పోశం. నరసింహారావు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,పార్టీ కార్యదర్శులు ముఖ్య నాయకులు వట్టం. రాంబాబు,యాదగిరి గౌడ్,ఎడ్ల శ్రీను,యూసఫ్ షరీఫ్, నాయకులు కృష్ణ,రామారావు, రమణ,రమేష్,యువజన నాయకులు రవి ప్రసాద్,హర్ష నాయుడు తదితరులు పాల్గొన్నారు.