ఉద్యోగులుగా ఎంపికైన గిరిజన నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అంకిత్
మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం ప్రాజెక్ట్ అధికారి అంకిత్ ఆదేశాల మేరకు సమగ్ర గిరిజన అభివృ ద్ధి సంస్థ ఏటూరు నాగారం ఆధ్వర్యంలో మండలాల వారీగా జాబ్ మేళాలో భాగంగా ములుగు జిల్లా ఏటూరునాగా రం వై టి సి నందు బుధవారం గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు వై టి సి ఏటూరు నాగారం నందు జాబ్ మేళా నిర్వహించ డం జరిగింది.ఈ కార్యక్రమంలో 06 ప్రైవేట్ కంపెనీలు వివిధ ఉపాధి రంగం లో ఉద్యోగ అవకాశాలు కల్పిం చుటకు ఈ జాబ్ మేళాలో పాల్గొనడం జరిగింది.ఈ జాబ్ మేళలో జిల్లా లోని పలు మండ లాల నుండి 94 మంది నిరు ద్యోగ యువతీ యువకులు హాజరు కాగా 49 మంది వివిధ కంపెనీలలో ఎంపిక అవటం జరిగింది.ఎంపిక కాబడిన అభ్యర్థుల కంపెనీల వారీగా వివరాలు ఎస్ఎస్ బయో ప్లాంటేషన్ 05 మంది,సన్ షైన్ హెల్త్ కేర్ 04 మంది, జీ4ఎస్ సెక్యూరిటీ కి 11 మంది,
గూగుల్ పే 04 మందిహేటిరో ఫార్మా 10మంది ఈక్విటీ గ్రూప్ 15 ఎంపిక అవటం జరిగిందని అన్నారు.
ఎంపికైన అభ్యర్థులకు అపా యింట్మెంట్ లెటర్స్ అందజే యటం జరిగిందని,ఈ ఎంపిక కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులకు వేతనం నెలకు .రూ 15వేల నుంచి రూ.35 వేల వరకు వారి యొక్క అర్హతను బట్టి సంబంధిత కంపెనీ వారు నిర్ణయించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమలో
ఏపీవో వసంతరావు,జేడీఎంకొండలరావు,జేఆర్పీలు,
మేకల పాపారావు,సరస్వతి,కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.